EPFO: పీఎఫ్ నగదు విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయవద్దు!

  • Dec 14, 2020, 07:02 AM IST

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి పలు సేవలు అందుతున్నాయి. ఈపీఎఫ్ అకౌంట్‌లోకి నెలా నెలా డబ్బు అవుతాయి. అవసరమైన సమయంలో మాత్రమే దీనిని విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమమైన నిర్ణయం. ఈపీఎఫ్ ద్వారా డబ్బు జమ, వడ్డీ, పెన్షన్, ఇన్సురెన్స్ లాంటి ఎన్నో సౌకర్యాలను పీఎఫ్ ఖాతాదారులు పొందుతున్నారు.

1 /6

How to Withdrawal PF Amount After Leaving the Job: ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి పలు సేవలు అందుతున్నాయి. ఈపీఎఫ్ అకౌంట్‌లోకి నెలా నెలా డబ్బు అవుతాయి. అవసరమైన సమయంలో మాత్రమే దీనిని విత్‌డ్రా చేసుకోవడం ఉత్తమమైన నిర్ణయం. ఈపీఎఫ్ ద్వారా డబ్బు జమ, వడ్డీ, పెన్షన్, ఇన్సురెన్స్ లాంటి ఎన్నో సౌకర్యాలను పీఎఫ్ ఖాతాదారులు పొందుతున్నారు.

2 /6

కొందరు ఉద్యోగులకు జాబ్ మారుతున్న సమయంలో ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు విత్‌డ్రా చేస్తుంటారు. వాస్తవానికి ఉద్యోగం మారినంత మాత్రానా ఈపీఎఫ్ (EPF) డబ్బులు చేయాలన్న రూల్ ఏం లేదు. ఉద్యోగి కొత్త కంపెనీ, సంస్థకు మారినా పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను అలాగే కొనసాగించవచ్చు.

3 /6

తాజాగా చేరిన సంస్థలో పాత ఈపీఎఫ్ నెంబర్ ఇస్తే అదే EPF Account యథావిధిగా కొనసాగుతుంది. అయితే డబ్బులు అవసరం లేకపోయినా కొందరు ఈపీఎప్ అకౌంట్ క్లోజ్ చేస్తుంటారు. పాత ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తారు. అలా చేస్తే దీర్ఘకాలంలో వడ్డీ నష్టపోతారు. ఇతర సేవింగ్స్ కన్నా ఈపీఎఫ్ ద్వారా అధిక వడ్డీ లభిస్తుంది.

4 /6

EPFO ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాదారుల నగదుపై 8.5 శాతం వడ్డీ ఇస్తోంది. కానీ జాబ్ మారినప్పుడు అకౌంట్ క్లోజ్ చేసి ఈపీఎఫ్ నగదు విత్‌త్రా చేస్తే.. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ బెనిఫిట్స్‌పై ప్రభావం పడుతుంది. పాత కంపెనీలలో చేసిన జాబ్ సర్వీస్ లెక్కలోకి రాదు. ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీ సర్వీస్ మాత్రమే ఈపీఎఫ్ఓ దగ్గర రికార్డ్ అవుతుంది.

5 /6

ఉద్యోగులు కంపెనీలు మారుతున్నా సరే పాత ఈపీఎఫ్ అకౌంట్‌నే కొనసాగించాలి. కావాలంటే ఖాతాను కొత్త కంపెనీకి బదిలీ చేసుకోవాలి. ఒకవేళ ఉద్యోగం మానేసినా మీ పీఎఫ్ ఖాతాలోని నగదుకు వడ్డీ అందుకుంటారు. అంతగా అవసరమైతే పీఎఫ్ ఖాతాలోని నగదు విత్‌త్రా చేసుకుంటే సరి. Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

6 /6

అత్యవసర సమయాలలో ఈపీఎఫ్ నగదు మిమ్మల్ని ఆదుకుంటుంది. కనుక ఎప్పుడు పడితే అప్పుడు పీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేయవద్దు, పీఎఫ్ నగదు విత్‌డ్రా చేయరాదు. దీనివల్ల మీకే నష్టం. కొత్త సంస్థలో చేరిన తర్వాత మరో పీఎఫ్ అకౌంట్ నెంబర్ వస్తుంది. దీని వల్ల మీకు ఇబ్బంది ఉండదు. పాత సంస్థ నుంచి ఈపీఎఫ్ నగదును కొత్త ఖాతాకు బదిలీ చేసుకోవాలి. మీ వివరాలు మొత్తం రికార్డ్ అవుతాయి. Read Also: EPFO: మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలియదా.. అయితే UAN యాక్టివేట్ చేసుకోండి